వార్నర్‌ సెంచరీ బాదేశాడు.

వార్నర్‌ సెంచరీ బాదేశాడు.
x
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో నేడు నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన...

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో నేడు నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఓ‍పెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సెంచరి బాదేశాడు. ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. 110 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో వార్నర్‌ సెంచరీ చేశాడు. ఇది వార్నర్‌కు 16వ వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో రెండో సెంచరీ. ఆసీస్‌ 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం ఖవాజా(50*) కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసి క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్ ఒక్కడే ఒక వికెట్ దక్కించుకున్నాడు.

మొదట రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, ఫించ్ ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యంతో ఆడి భారీ స్కోర్ అందించారు. ముందుగా వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా 20 వ ఓవర్‌లో ఫించ్ 50 పరుగులు చేశాడు. అయితే సౌమ్య సర్కార్ బౌలింగ్ లో ఫించ్ ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories