విరాట్ కొహ్లీకి విశ్రాంతి

విరాట్ కొహ్లీకి విశ్రాంతి
x
Highlights

గత మూడుమాసాలుగా నాన్ స్టాప్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం...

గత మూడుమాసాలుగా నాన్ స్టాప్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న పాంచ్ పటాకా సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేలతో పాటు తీన్మార్ టీ-20 సిరీస్ కు కొహ్లీ దూరం కానున్నాడు. కొహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన తీన్మార్ టీ-20, నాలుగు మ్యాచ్ ల టెస్ట్, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో పాల్గొన్న విరాట్ కొహ్లీ ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ లోని మొదటి మూడు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 26, 29 తేదీలలో మౌంట్ మాంగనీ లోని బేపార్క్ ఓవల్ వేదికగా జరిగే రెండు, మూడు వన్డేలలో మాత్రమే కొహ్లీ పాల్గొంటాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories