భారత యాడ్ మార్కెట్లో విరాట్ కొహ్లీ టాప్

Virat Kohli
x
Virat Kohli
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు భారత యాడ్ మార్కెట్లో సైతం రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటి వరకూ భారత అత్యంత విలువైన బ్రాండ్ వాల్యూ కలిగిన షారుక్ ఖాన్ ను ఐదోస్థానానికి నెట్టడం ద్వారా విరాట్ కొహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు భారత యాడ్ మార్కెట్లో సైతం రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటి వరకూ భారత అత్యంత విలువైన బ్రాండ్ వాల్యూ కలిగిన షారుక్ ఖాన్ ను ఐదోస్థానానికి నెట్టడం ద్వారా విరాట్ కొహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు. ఏడాది ఏడాదికీ పెరిగిపోతున్న విరాట్ కొహ్లీ బ్రాండ్ బాజా పై స్పెషల్ స్టోరీ.

విరాట్ కొహ్లీ ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ ఆటగాడు. ఆటలోనే కాదు సంపాదనలోనూ, యాడ్ మార్కెట్లో బ్రాండ్ విలువలోనూ తిరుగులేని మొనగాడు. క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు భారత యాడ్ మార్కెట్లో సైతం విరాట్ కొహ్లీ ఏడాది ఏడాదికీ తన బ్రాండ్ వాల్యూని అనూహ్యంగా పెంచుకొంటూ దూసుకుపోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 బ్రాండ్లకు కొహ్లీ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కాసుల పంట పండించుకొంటున్నాడు.

2018-19 సీజన్లో భారత బ్రాండ్ మార్కెట్లో కొహ్లీ వరుసగా రెండో ఏడాది టాపర్ గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చి చూస్తే కొహ్లీ బ్రాండ్ విలువ 18 శాతం మేర పెరిగింది. కొహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విఖ్యాత బ్రాండ్ ల్లో టిస్సోట్, ఆడీ, ఎమ్మారెఫ్ సైతం ఉన్నాయి. బ్రాండ్ కొహ్లీ మార్కెట్ విలువ ప్రస్తుతం 170.8 మిలియన్ డాలర్లకు చేరింది.

అంతేకాదు కొహ్లీ ఒక్కో బ్రాండ్ ప్రచారానికి రోజుకు 5 కోట్ల రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నాడు. గత కొద్ది సంవత్సరాల కాలంలోనే విరాట్ కొహ్లీ నికర ఆస్తుల విలువ 50 కోట్లరూపాయలకు చేరింది. అంతేకాదు 9కోట్ల రూపాయల విలువైన ఆరు లగ్జరీ కార్లు సైతం కొహ్లీ గారేజ్ లో ఉన్నాయి.

వివిధ సంస్థలలో కొహ్లీ కి18 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు సైతం ఉన్నాయి. జిమ్ చెయిన్ చీజెల్ ఓనర్ గా, తన పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ఓనర్ గా కూడా విరాట్ కొహ్లీ వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ధూమ్ ధామ్ వన్డే ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్న విరాట్ కొహ్లీ అంతర్జాతీయస్థాయిలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న క్రికెటర్ గా నిలిచాడు.

భారత క్రికెట్ బోర్డు వార్షిక కాంట్రాక్టుల్లో-ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్ గా ఉన్న కొహ్లీ ఏడాదికి 7 కోట్ల 50లక్షల రూపాయల పారితోషికం అందుకొంటున్నాడు. అంతేకాదు భారత దేశవాళీ ఐపీఎల్ లీగ్ లో 2 నెలల కాంట్రాక్టు కింద బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి 14 కోట్ల రూపాయలు కాంట్రాక్టు మనీగా సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన క్రీడాకారుల ఫోర్బ్స్ జాబితా 7వ స్థానంలో కొహ్లీ కొనసాగుతున్నాడు. కొహ్లీ మొత్తం ఆస్తుల విలువ 500 కోట్లుగా ఉంది.

గతంలో బ్రాండ్ వాల్యూ టాపర్ గా ఉన్న షారుక్ ఖాన్ కొహ్లీ దెబ్బతో ఐదోస్థానానికి పడిపోయాడు. మరోవైపు కొహ్లీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ మెరుపుతీగ దీపిక పడుకోన్ నిలిచింది. దీపిక 21 బ్రాండ్ లకు ప్రచారం చేస్తోంది. దీపిక బ్రాండ్ వాల్యూ 102.5 మిలియన్ డాలర్లకు చేరింది.

భారత బ్రాండ్ మార్కెట్లో స్పోర్ట్స్ సెలబ్రిటీలు విరాట్ కొహ్లీ, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, పీవీ సింధుల సంయుక్త వాటా 27 శాతంగా ఉంది. ఈ నలుగురి బ్రాండ్ వాల్యూ 241 మిలియన్ డాలర్లకు చేరటం విశేషం. విరాట్ కొహ్లీ సంపాదన, స్థిరచరాస్థులకు అతని భార్య అనుష్క ఆస్తులను కలిపితే 650 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. వచ్చే మూడేళ్లకాలంలో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల సంయుక్త ఆదాయం తో పాటు బ్రాండ్ విలువ సైతం 30 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఏదిఏమైనా భారత క్రీడారంగంలో ప్రస్తుతం విరాట్ కొహ్లీ హవా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories