IND vs WI టీ20 మ్యాచ్ : అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు

IND vs WI టీ20 మ్యాచ్ : అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు
x
ఉప్పల్ స్టేడియం
Highlights

స్టేడియం మొత్తం సీసీ కెమెరాల అమర్చారు. తక్షణ వైద్య సేవల కోసం 3 -8 అంబులెన్స్‌లు, 4-5 ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు.

హైదరాబాద్ కి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు భారత్ - వెస్టిండిస్ జట్ల మధ్య రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసరాల్లో 1800 పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.

మ్యాచ్ జరగనున్న నేపధ్యంలో స్టేడియంలోనికి సిగరెట్లు, ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్థాలు, ఫర్ ఫ్యూమ్స్‌కు అనుమతి లేదు. కేవలం జాతీయ జెండాలకు మాత్రమే అనుమతి కల్పించారు. స్టేడియం మొత్తం సీసీ కెమెరాల అమర్చారు. తక్షణ వైద్య సేవల కోసం 3 -8 అంబులెన్స్‌లు, 4-5 ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. ఇక ప్రేక్షకులకి ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లును నడపనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories