సెమీఫైనల్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..

సెమీఫైనల్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..
x
Highlights

లీగ్ దశలో 9 మ్యాచుల్లో ఏడు విజయాలు ఒక ఓటమి. లీగ్ దశ ముగిసే సమయానికి 15 పాయింట్లతో అగ్రస్థానం ఐదు సెంచరీలతో ఫామ్‌లో ఉన్న రోహిత్ కానీ సెమీస్‌లో పరాజయం....

లీగ్ దశలో 9 మ్యాచుల్లో ఏడు విజయాలు ఒక ఓటమి. లీగ్ దశ ముగిసే సమయానికి 15 పాయింట్లతో అగ్రస్థానం ఐదు సెంచరీలతో ఫామ్‌లో ఉన్న రోహిత్ కానీ సెమీస్‌లో పరాజయం. స్వల్ప టార్గెట్‌ను అందుకోలేక పోయిన భారత్ ఇంతకీ టీమిండియా ఓటమికి కారణాలేంటి. 2019 వరల్డ్ కప్ లో టీమిండియా భారీ అంచనాలతో బరిలోకి దిగింది. దానికి తగట్టుగానే తొలి మ్యాచ్ నుంచి రాణిస్తూ వచ్చింది.. వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి అగ్ర జట్లను మట్టి కరిపించింది. ఇలా లీగ్ దశలో 8 మ్యాచులు ఆడిన కోహ్లి సేన ఒక్క మ్యాచ్ లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. లీగ్ దశ ముగిసే సరికి భారత్ 15 పాయింట్లో అగ్రస్థానంలో నిలిచి రాజసంగా సెమీస్ లోకి వచ్చింది. అయితే సెమీస్‌లో స్వల్ఫ లక్ష్య చేధనలో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టోర్నీ నుంచి టీమిండియా ఇంటి ముఖం పట్టింది. సెమీస్ మ్యాచ్ మంగళవారం జరగాలి అయితే మంగళవారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అప్పటికే న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లను భారత బౌలర్లు కట్టడి చేశారు.. ఇక మ్యాచ్ జరిగే మాంచెస్టర్‌‌లో భారీ వర్షం పడటంతో పిచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనిని భారత బ్యాట్సమెన్లు గమనించేలోగా జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగిపోయింది.

ఇక ఓటమికి మరో కారణం భారత ఆటగాళ్ల లేజీ‌నెస్ టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్లు ఇద్దరు చాలా కేర్ లెస్ గా ఆడారు. తొలిత రోహిత్ అవుట్ అయినా రాహుల్ శ్రద్ధ చూపించలేదు.. చెత్త ఆట ఆడి ఫెవీలియన్ కు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి కనీసం 50 పరుగులు చేసిఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఇక విరాట్ కూడా కాస్త జాగ్రత్తగా ఆడి ఉండాల్సింది. మరోవైపు జట్టు గాడిలో పడుతుంది అన్న సమయంలో పంత్, పాండ్యాలు భారీ షాటుకు ప్రయత్నించి ఫెవీలియన్ కు చేరడం భారత ఓటమికి మరో కారణంగా చెప్పుకోవచ్చు ఆ సమయంలో వారు స్కోర్ బోర్డుకు మరో 50 పరుగులు జోడించి ఉంటే టీమిండియా ఫైనల్ కు చేరేది.

భారత్ తో పోల్చుకుంటే న్యూజిలాండ్ చాలా చిన్న టీమ్ టీమిండియా ఎన్నో సార్లు న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది.. ప్రస్తుత భారత ఆటగాళ్ల ఫామ్ కూడా వాళ్లకన్నా ఎంతో బాగుంది. కానీ సెమీస్ లో టీమిండియాను న్యూజిలాండ్ కంటే ముందు ఒత్తిడి ఓడించింది. టాస్ ఓడిపోవడంతోనే మ్యాచ్ ఓడిపోయినట్లు ఫీల్ అయ్యారు. బౌలర్లు న్యూజిలాండ్ ను కట్టడి చేసినా ఓత్తిడితో ఓటమి చవిచూశారు. మొత్తానికి టీమిండియా ఓటమికి ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. చివరికి ఒత్తిడి కారణంగా భారత్ ఇంటి ముఖం పట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories