ఐసీసీ టీంలో కోహ్లీకి దక్కని చోటు!

ఐసీసీ టీంలో కోహ్లీకి దక్కని చోటు!
x
Highlights

ప్రపంచం లోని ఉత్తమ క్రికెటర్లను వారి ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా ఎంచుకుని ఐసీసీ తన జట్టును ప్రకటించడం ఆనవాయితీ. ఇదే విధంగా ఈ ప్రపంచకప్ ఫైనల్స్...

ప్రపంచం లోని ఉత్తమ క్రికెటర్లను వారి ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా ఎంచుకుని ఐసీసీ తన జట్టును ప్రకటించడం ఆనవాయితీ. ఇదే విధంగా ఈ ప్రపంచకప్ ఫైనల్స్ ముగియడంతో ఈరోజు ఐసీసీ ప్రపంచ క్రికెట్ జట్టును ప్రకటించింది. ఇందులో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. ఈ జట్టులో భారత్‌ నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లే అవకాశం దక్కించుకోగా.. అత్యధికంగా ఇంగ్లండ్‌ నుంచి నలుగురికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్‌ తరఫున ఒక్కరు ఎంపికయ్యారు. భారత్‌ నుంచి టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, యార్కర్ల కింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రాకుల మాత్రమే చోటుదక్కింది.

ఇక ఈ మెగా జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా.. వికెట్‌ కీపర్‌గా ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్‌ టోర్నీ ప్రదర్శన ఆధారంగానే ఈ జట్టును ఎంపిక చేయడంతో భారత కెప్టెన్‌కు చోటు దక్కలేదు. రోహిత్‌ శర్మ 5 సెంచరీలతో చెలరేగి పరుగుల జాబితాలో టోర్నీ టాపర్‌గా నిలవగా.. 18 వికెట్లతో బుమ్రా రాణించాడు. ఇక 12వ ఆటగాడిగా న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ను ఎంపిక చేశారు.

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ

విలియమ్సన్‌(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జాసన్‌ రాయ్‌ (ఓపెనర్స్‌), జోరూట్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ స్టార్క్‌, జోఫ్రా ఆర్చర్‌, ఫెర్గ్‌సన్‌, జస్ప్రిత్‌ బుమ్రా. 12వ ఆటగాడు: ట్రెంట్‌ బౌల్ట్‌



Show Full Article
Print Article
More On
Next Story
More Stories