రోహిత్ ను అడ్డుకునే బౌలరే లేడు : క్లార్క్

రోహిత్ ను అడ్డుకునే బౌలరే లేడు : క్లార్క్
x
Highlights

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా అందులో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చేరాడు....

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా అందులో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చేరాడు. రోహిత్ ను అడ్డుకునే బౌలరే లేరంటూ కితాబిచ్చాడు.

ఈరోజు మరికొన్ని గంటల్లో మాంచెస్టర్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపధ్యంలో మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ లీగ్‌ దశలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఇప్పటికే ఫైనల్స్‌ కోసం ఒక అడుగు ముందుకేసిందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంటే.. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కివీస్‌ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఎంత బాగా ఆడుతున్నా న్యూజిలాండ్‌ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పాడు. మంచి ప్రదర్శన చేసి ఫైనల్‌ చేరాలని ఆకాక్షించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories