logo

వాళ్ళెప్పుడెలా ఆడతారో ఊహించలేం .. పాక్ టీమ్ పై సానియా

వాళ్ళెప్పుడెలా ఆడతారో ఊహించలేం .. పాక్ టీమ్ పై సానియా
Highlights

తన అస్థిర ఆట పద్ధతిని వరల్డ్ కప్ టోర్నీలో మరో మారు బయట పెట్టుకున్న పాకిస్థాన్ కు ఆ దేశపు కోడలు.. మనదేశపు...

తన అస్థిర ఆట పద్ధతిని వరల్డ్ కప్ టోర్నీలో మరో మారు బయట పెట్టుకున్న పాకిస్థాన్ కు ఆ దేశపు కోడలు.. మనదేశపు ఆడపడుచు టెన్నిస్ తార సానియా మీర్జా స్పందించారు.

"పాకిస్థాన్ జట్టుకు శుభాభినందనలు. ఓ మ్యాచ్ లో ఓటమిపాలైనా పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. క్రికెట్ ప్రపంచకప్ మరింత ఆసక్తికరంగా మారిందనడంలో ఎలాంటి సందేహంలేదు" అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా వెస్టిండీస్ జట్టుపై ఘోర పరాభవం చెందిన పాకిస్థాన్ జట్టును ఆదేశంలో అందరూ దుమ్మెత్తి పోశారు. రెండు రోజుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన తమ జట్టును చూసి పొంగిపోతున్నారు. వరల్డ్ కప్ కొట్టే సత్తా తమ దేశానికే ఉందంటూ పాకిస్థాన్ అభిమానులు తమ జట్టును పొగడఁత్లతో ముంచేస్తున్నారు.
లైవ్ టీవి


Share it
Top