బంగ్లాతో భారత్ పోరు కొద్ది గంటల్లో..

బంగ్లాతో భారత్ పోరు కొద్ది గంటల్లో..
x
Highlights

నిన్నటి వరకూ ఎంతో ధీమా.. అపజయం ఎరుగని టీమ్ గా మెండైన ఆత్మవిశ్వాసం.. ఒక్క ఓటమి! అన్నిటినీ తారుమారు చేసింది. పులినైనా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న వాడు...

నిన్నటి వరకూ ఎంతో ధీమా.. అపజయం ఎరుగని టీమ్ గా మెండైన ఆత్మవిశ్వాసం.. ఒక్క ఓటమి! అన్నిటినీ తారుమారు చేసింది. పులినైనా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న వాడు పిల్లి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది టీమిండియా ప్రస్తుతం. ఒక్క ఓటమి తోనే దేనినీ లేక్కవేయడం.. తక్కువ చేయడం సరికాదు. కానీ, ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో ఒక్క ఓటమే జట్టు లోపాల్ని ప్రత్యర్థులకు అస్త్రాలుగా అందిస్తుంది. ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలబడబోతోంది. మామూలుగా అయితే, ఇది టీమిండియా కి ఇది చిన్న విషయమే. కానీ, కప్పు ఎగరేసుకు పోయే సత్తా లేకున్నా.. పెద్ద జట్లకు షాకిచ్చి అంచనాల్ని తారుమారు చేసే లక్షణమున్న జట్టు బంగ్లాదేశ్. తనదైన రోజున ఎంత పెద్ద టీమునైనా మట్టికరిపించాగలగడం ఆ జట్టు ప్రత్యేకత.

ఇంత ఎందుకంటే.. సమీకరణాలతో పని లేకుండా సెమీస్ కు వెళ్ళాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది. ఈ మ్యాచ్ గెలిస్తే 13 పాయింట్లతో కోహ్లీసేన నేరుగా సెమీస్‌కు వెళ్ళిపోతుంది. ఇది ఓడితే శ్రీలంక తో జరిగే ఆఖరి మ్యాచ్ వరకూ ఎదురు చూడాలి. సెమీస్ ఒక్కటే కాకుండా.. పాయింట్ల పట్టికలో ఎవరు ఎక్కడ ఉంటారో కూడా కీలకమైన విషయమే. అందుకే కచ్చితంగా చివరి రెండు మ్యచులూ ఇండియా గెలిచి తీరాల్సిందే.

ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే.. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ రేస్ లో నిలుస్తుంది ఆ జట్టు. ఈ టోర్నీలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ లకు చుక్కలు చూపించింది బంగ్లాదేశ్. ఆ లెక్కన చూస్తే అంత సులువుగా టీమిండియాకు లొంగే అవకాశం ఉండదు.

భారత్ ను భయపెడుతున్నది బ్యాటింగే!

అవును.. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ప్రపంచంలోనే టాప్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీమిండియా ప్రస్తుతం ఆ విషయంలోనే ఆందోళన చెందుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరం అవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఓపెనర్ గా రాహుల్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నా.. ఇది సరిపోదు. రోహిత్ శర్మ నిదానంగా ఆరంభిస్తాడు. ధావన్ మెరుపులు మెరిపిస్తాడు. దాంతో మొదటి పవర్ ప్లే లో పరుగులు కనిపించేవి. ఇపుడు రాహుల్ కూడా నెమ్మదిగానే ఆడుతుంటే పవర్ ప్లేలో కనీసం 50 పరుగులు తగ్గిపోతున్నాయి. ఇదే ప్రధాన సమస్య. ఇక మిడిల్ ఆర్డర్.. నెంబర్ 4 భారత్ కు ఇప్పటి సమస్య కాదు. రాహుల్ సరిగ్గా సరిపోయాడు అనుకునేంతలో ఓపెనర్గా ప్రమోట్ కావడంతో చిక్కులు వచ్చిపడ్డాయి. ఇపుడు పంత్ వచ్చాడు. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ధోనీలో మునుపటి వేగం కనిపించడం లేదు. దీంతో ఒత్తిడి పాండ్యా మీద పడుతోంది. ఇన్ని సమస్యలు ఉన్నా ఇప్పటివరకూ మేనేజ్ చేసింది టీమిండియా.. అయితే, ఇక నాకౌట్ కు చేరుకుంటున్న సందర్భంలో ఈ చివరి రెండు లీగ్ మ్యాచుల్లో బలహీనతల్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories