logo

అభిమానుల్లో ఈ అభిమాని వేరయా!

అభిమానుల్లో ఈ అభిమాని వేరయా!
Highlights

టీమిండియా ఆడుతుందంటే ప్రపంచంలో ఏమూలనైనా సరే ఆ సందడే వేరు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు....

టీమిండియా ఆడుతుందంటే ప్రపంచంలో ఏమూలనైనా సరే ఆ సందడే వేరు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆబాలగోపాలం ప్రత్యక్షంగా చూస్తూ భారత్ టీంను ఉత్సాహపరుస్తుంటారు. ఈ ప్రపంచ కప్ లో ఓ పెద్దావిడ టీమిండియాను ఉత్సాహ పరచడం అందరినీ ఆకర్షించింది. తన కుటుంబం తో మ్యాచ్ చూడటానికి వచ్చిన 87 ఏళ్ల బామ్మ యువకుల్ని మించిన ఉత్సాహంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపూ సందడి చేసింది. కేరింతలు కొడుతూ, బూర ఊదుతూ.. కుర్ర అభిమానులకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉత్సాహం ప్రదర్శించిందామె. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా కళ్ళన్నీ ఆ బామ్మ పైనే. ఆమెను చూపించిన ప్రతిసారి టీవీల ముందున్న వారు కూడా సంబరపడిపోయారు. అంతలా ఆకట్టుకున్న ఆ బామ్మను మ్యాచ్‌ అనంతరం కోహ్లి, రోహిత్‌ కలిసి ఆశీర్వాదం తీసుకోగా.. వాళ్లిద్దరికీ బామ్మ ముద్దులు పెట్టి విజయం సాదిస్తారంటూ దీవించింది. తనకు భారత జట్టంటే చాలా ఇష్టమని, ఆటగాళ్లు తన పిల్లల్లాంటి వారని అన్న ఈ బామ్మ.. టీమ్‌ఇండియా కచ్చితంగా ప్రపంచకప్‌ గెలుస్తుందని చెప్పింది.

కొసమెరుపు.. ఆ బామ్మ ఉత్సాహాన్ని చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఈ బామ్మకు మ్యాచ్‌ టికెట్లు, ఇతర ఖర్చులు స్పాన్సర్‌ చేస్తానని ప్రకటించారు.

లైవ్ టీవి

Share it
Top