అయ్యో.. ఛాన్స్ మిస్ అయ్యారు!

అయ్యో.. ఛాన్స్ మిస్ అయ్యారు!
x
Highlights

ఒక్కోసారి చిన్న అశ్రద్ధ.. కొంప ముంచేస్తుంది. సరిగ్గా అదే జరిగింది ఆదివారం జరిగిన టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్...

ఒక్కోసారి చిన్న అశ్రద్ధ.. కొంప ముంచేస్తుంది. సరిగ్గా అదే జరిగింది ఆదివారం జరిగిన టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరూ చెలరేగిపోయారు. వారిని అదుపు చేయడం టీమిండియా బౌలర్లకు సాధ్యం కాలేదు. అయితే.. ఒక అవకాశం ఇండియా చేయిజారిపోయింది. ఇన్నింగ్స్ 11 వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో బంతిని రాయ్ షాట్ కొట్టబోయాడు.. కీపర్ ధోనీకి చిక్కాడు. ధోనీ వెంటనే అవుట్ అని అప్పీల్ చేశాడు. కనీ, అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు.

దీనిని భారత కెప్టెన్ కోహ్లీ కూడా తేలిగ్గా తీసుకున్నాడు.

అయితే, ఫుటేజ్ లో రాయ్ బ్యాట్ ఎడ్జికి బంతి తాకిందని స్పష్టంగా కనిపించింది. టీమిండియా రివ్యూ కోరక పోవడంతో రాయ్ బతికిపోయాడు. అదే రివ్యూ కోరి ఉంటె.. 21 పరుగుల వద్దే రాయ్ పెవిలియన్ చేరే వాడు.. ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడీ విడిపోయేది.. తర్వాత ఏం జరిగినా.. భారీ భాగస్వామ్యం అయితే నెలకొనేది కాదు. అది తరువాత బ్యాట్స్ మెన్ పై ప్రభావం చూపించేది. అదే మరి బ్యాడ్ లక్ అంటే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories