హామిల్టన్ వన్డేలో టీమిండియాకు కివీస్ షాక్

హామిల్టన్ వన్డేలో టీమిండియాకు కివీస్ షాక్
x
Highlights

పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా విజయపరంపరకు న్యూజిలాండ్ ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. హామిల్టన్ లోని సెడ్డన్ పార్క్ వేదికగా ముగిసిన నాలుగో...

పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా విజయపరంపరకు న్యూజిలాండ్ ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. హామిల్టన్ లోని సెడ్డన్ పార్క్ వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల భారీ విజయంతో టీమిండియా ఆధిక్యాన్ని 3-1కి తగ్గించగలిగింది. స్వింగ్, సీమ్ బౌలింగ్ కు అనువుగా ఉన్న హామిల్టన్ పిచ్ పై కివీజట్టు ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొంది. రోహిత్ శర్మ నాయకత్వంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. భారత మిడిలార్డర్ ఆటగాళ్లు రాయుడు, దినేశ్ కార్తీక్ డకౌట్లుగా వెనుదిరిగారు. లోయర్ ఆర్డర్ ఆటగాడు యజువేంద్ర చాహల్ 18 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 10 ఓవర్లలో 21 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. సమాధానంగా 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరింది. ఓపెనర్ నికోల్స్ 30, రోజ్ టేలర్ 37 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయి చేరడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన ట్రెంట్ బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories