తొలి మ్యాచ్ టీమిండియాదే!

తొలి మ్యాచ్ టీమిండియాదే!
x
Highlights

ఒక్కోసారి చిన్న లక్ష్యం కూడా కొంచెం కంగారు పెడుతుంది. సరిగ్గా అదే జరిగింది టీమిండియా విషయంలో. వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో తొలి మ్యాచ్ ఆడుతున్న...

ఒక్కోసారి చిన్న లక్ష్యం కూడా కొంచెం కంగారు పెడుతుంది. సరిగ్గా అదే జరిగింది టీమిండియా విషయంలో. వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్ జట్టు 228 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగింది. అయితే, తొలి ఓవర్లలో పిచ్ తీరు చూసి ఇక్కడ బ్యాటింగ్ చేయగలరా అనిపించింది. రబడా విసురుతున్న ఒక్కో బంతీ ఒక్కో మిసైల్ లా అంతుచిక్కకుండా తమ పైకి ఉరికి వస్తుంటే భారత్ బ్యాట్స్ మెన్ కొద్దిగా కంగారు పడ్డారు. వికెట్లను కాపాడుకోవడం మీదే దృష్టి పెట్టారు. అయినా సరే, ధావన్, కోహ్లీ తక్కువ పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం తనదైన శైలిలో కూల్ గా దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నాడు. డిఫెన్సివ్ ప్లే తో ఆ పిచ్ మీద ఎలా ఆడాలో నేర్పిస్తున్నట్టు గా ఆడాడు. ఎక్కడా తొణక్కుండా.. తన పని తాను చేసుకుంటూ పోయాడు. కెఎల్ రాహుల్ అతనికి అండగా నిలిచాడు. కొంత సేపటికి ఇన్నింగ్స్ నిలబెట్టిన తరువాత కెఎల్ రాహుల్ గేరు మార్చే పనిలో రబడా బౌలింగ్ లో డుప్లిసిస్ కి కేచ్ ఇచ్చి అవుటయిపోయాడు. ఈ తరుణంలో రంగం లోకి ధోనీ వచ్చాడు. తాను కూడా రాహుల్ స్కూల్ ని కూల్ గా ఫాలో అయిపోయాడు. ధోనీ వచ్చిన తరువాత రోహిత్ శర్మ వన్డేల్లో తన 23 వ శతకాన్ని సాధించాడు. వరల్డ్ కప్ లో రాహుల్ కు ఇది రెండో శతకం.

ఇక సెంచరీ పూర్తయిన తరువాత రోహిత్, ధోనీ తమ బ్యాటులకు పని చెప్పారు. ఒక్కసారిగా గేరు మార్చారు. అంతా సజావుగా సాగుతున్న వేళ 46 బంతులాడిన ధోనీ, తన 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి మోరిస్ కు రిటన్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తరువాత హార్దిక్ పాండ్య క్రీజులోకి వచ్చి మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇంకో పదహారు బంతులు ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో భరత్ విజయ ఢంకా మోగించింది.

తొలి పది ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సందర్భాల్లో టీమిండియా విజయం సాధించడం సర్వసాధారణమని మరోసారి రుజువైంది.

టీమిండియా స్కోర్స్..














Show Full Article
Print Article
More On
Next Story
More Stories