భారీ విజయం దిశగా టీమిండియా

భారీ విజయం దిశగా టీమిండియా
x
Highlights

ఒక వికెట్ పడితే ఒక్క ఓవర్ తరువాత మరో వికెట్.. మళ్ళీ ఓ నాలుగైదు ఓవర్ల గ్యాప్ మళ్ళీ రెండు వరుస వికెట్లు.. ఇలా మూడోసారి. దీంతో ఆరు వికెట్లు కోల్పోయి...

ఒక వికెట్ పడితే ఒక్క ఓవర్ తరువాత మరో వికెట్.. మళ్ళీ ఓ నాలుగైదు ఓవర్ల గ్యాప్ మళ్ళీ రెండు వరుస వికెట్లు.. ఇలా మూడోసారి. దీంతో ఆరు వికెట్లు కోల్పోయి పరాజయం అంచుల్లోకి వచ్చేసింది విండీస్ జట్టు. ఒక్క భాగస్వామ్యం తప్ప చెప్పుకోతగ్గట్టుగా ఏ బ్యాట్స్ మెన్ కూడా బ్యాటింగ్ చేయలేదు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియా విజయానికి బాటలు వేస్తున్నారు. 20 వ ఓవర్లో పూరన్ వికెట్ కోల్పోయినప్పటికీ విండీస్ స్కోరు 79 తరువాత మరో 18 పరుగులు జోడించి హోల్డర్ (6 ) చాహల్ బౌలింగ్ లో జాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అక్కడ నుంచి మరో 9 పరుగులు చేసిన తరువాత 27 వ ఓవర్లో బ్రాత్వైట్ (1 ) బుమ్రా బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. అప్పుడు జట్టు స్కోరు 107 . ఇక అదే స్కోరు వద్ద తరువాత బంతికే అల్లెన్ డకౌట్ అయ్యాడు. ఈ వికెట్ కూడా బుమ్రా కె దక్కింది. మొత్తమ్మీద 28 ఓవర్లో ఏడూ వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది విండీస్. విజయానికి ఇంకా 157 పరుగులు కావాల్సిన స్థితిలో ఆ జట్టు చేతిలో మూడు వికెట్లే ఉన్నాయి. మొత్తమ్మీద భారీ విజయం దిశగా భారత్ వెళుతోంది. ఎంత తేడాతో గెలుస్తారనేదే ఇప్పుడు ప్రశ్న.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories