టీం ఇండియాకి కొత్త కోచ్... త్వరలో ప్రకటన

టీం ఇండియాకి కొత్త కోచ్... త్వరలో ప్రకటన
x
Highlights

టీంఇండియా జట్టుకు త్వరలో కొత్త కోచ్ రానున్నాడు . దీనికోసం త్వరలో బీసీసీఐ నుండి ఓ ప్రకటన వెలువడనుంది .. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్టు...

టీంఇండియా జట్టుకు త్వరలో కొత్త కోచ్ రానున్నాడు . దీనికోసం త్వరలో బీసీసీఐ నుండి ఓ ప్రకటన వెలువడనుంది .. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్టు పూర్తి అయింది . మళ్ళీ కోచ్ గా కొనసాగాలి అనుకుంటే అయన కూడా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే .. అయితే భారత్ కి వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్ ఉంది . దీనికి మాత్రం రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరిస్తారు . అందుకోసం రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల కాంట్రాక్టును మరో 45 రోజులు పొడిగించారు .. సెప్టెంబర్ 15 న స్వదేశంలో భారత్ దక్షిణాప్రికా జట్టుతో మ్యాచ్ ఆడనుంది . అప్పటి వరకు కొత్త కోచ్ ని నియమించాలని అనుకుంటున్నట్లు అందువల్లే త్వరలో దరఖాస్తులకి ఆహ్వానించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అనిల్ కుంబ్లే తర్వాత టీంఇండియా జట్టుకు రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories