ప్రపంచకప్ కు విరాట్ సేన ఎంపిక నేడే...మరికాసేపట్లో 15 మంది సభ్యుల...

ప్రపంచకప్ కు విరాట్ సేన ఎంపిక నేడే...మరికాసేపట్లో 15 మంది సభ్యుల...
x
Highlights

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును మరి కాసేపట్లో బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది. కెప్టెన్...

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును మరి కాసేపట్లో బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీతో సహా మొదటి 14 మంది ఆటగాళ్ల స్థానాలు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి. అయితే టీమిండియా టాపార్డర్ కే కీలకంగా మారిన రెండోడౌన్ స్థానం ఎంపికే ఇప్పుడు కీలకంగా మారింది. నాలుగోనంబర్ స్థానం కోసం అంబటి రాయుడు, ఆల్ రౌండర్ విజయ్ శంకర్, యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ పోటీపడుతున్నారు. నాలుగో పేసర్ ఎంపిక కూడా సెలెక్టర్లకు పెద్దపరీక్షే కానుంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, విజయ్ శంకర్,కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ సభ్యులుగా ఉండే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories