క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అంబటి రాయుడు

క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అంబటి రాయుడు
x
Highlights

మనస్తాపంతో క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు అంబటి రాయుడు. టీమిండియా లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు...

మనస్తాపంతో క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు అంబటి రాయుడు. టీమిండియా లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ టోర్నీకి తనను ఎంపిక చేస్తారని భావించాడు రాయుడు. అయితే, అతని బదులు విజయ్ శంకర్ ను ఎంపిక చేశారు. మొన్న విజయశంకర్ కు గాయం కావడంతో తనకి పిలు[పిలుపు వస్తుందని ఆశించాడు. కానీ, మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో నిరాశ చెందిన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా జట్టులో స్టాండ్ బై లో ఉన్నా తనని కాదని వేరే వారికి అవకాశం దక్కడంతో తీవ్రంగా మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.

క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌ల్లో 3,300 పరుగులు రాయుడు చేశాడు. చివరిగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories