భార‌త జ‌ట్టుపై జ‌రిమానా

భార‌త జ‌ట్టుపై జ‌రిమానా
x
Highlights

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో భారత జట్టు ఆదరగోడుతుంది. ఇప్పటికే 4-0 తో సిరీస్ లో ముందంజలో ఉండి ఆతిధ్య జట్టును కంగారు పెడుతుంది.

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో భారత జట్టు ఆదరగోడుతుంది. ఇప్పటికే 4-0 తో సిరీస్ లో ముందంజలో ఉండి ఆతిధ్య జట్టును కంగారు పెడుతుంది. ఈ క్రమంలో భారత్ కి భారీ షాక్ తగిలినట్టు అయింది. శుక్రవారం వెల్లింగ్టన్‌లో జ‌రిగిన నాలుగో టీ20లో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు కావడంతో అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) భార‌త‌జ‌ట్టుపై మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతను విధించింది. ఈ విషయాన్నీ మ్యాచ్ రిఫ‌రీ క్రిస్ బ్రాడ్‌ తెలిపారు.

ఈ మ్యాచ్‌లో నిర్ణీత స‌మ‌యానికి రెండు ఓవ‌ర్లు భారత జట్టు త‌క్కువ వేసింది. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా త‌ప్పిదాన్ని అంగీక‌రించ‌డంతో దీనిపై త‌దుప‌రి విచార‌ణ ఉండదు. ఐసీసీ రూల్స్ ప్రకారం నిర్ణీత స‌మ‌యం కంటే ఒక ఓవ‌ర్ త‌క్కువ‌గా వేస్తే 20 శాతం కోత విధిస్తారు. ఇక నాలుగో టీ20 మ్యాచ్ లో భార‌త జట్టు రెండు ఓవ‌ర్లు త‌క్కువగా వేయడంతో మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతను విధించాల్సి వచ్చింది.

ఇక ఇప్పటికే 4-0 తో సిరీస్ లో ముందంజలో ఉన్న భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ని ఆతిధ్య జట్టుతో ఆదివారం మౌంట్ మాంగ‌నీలో జ‌రుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం 12 గంటలకి ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ లు ప్రారంభం కానున్నాయి.

తుది జట్టు అంచనా :

భారత్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్

న్యూజిలాండ్‌: గప్పిల్స్‌ మన్రో, నీఫెర్ట్‌ విలియమృన్‌ (కెప్టెన్‌), రాన్‌ టేలర్‌, గ్రాండ్‌ హోమ్‌, శాంట్నర్‌, ఇష్‌ సోధి, సౌధ టిక్నార్‌, బెనెట్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories