సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయం

సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయం
x
Highlights

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో...

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ జయభేరి మోగించింది. దీంతో సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయం తో పాటు పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), అక్షర్‌ పటేల్‌ (13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23 నాటౌట్‌) మాత్రమే రాణించారు. నబీ, భువనేశ్వర్‌, కౌల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టోకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories