ఆర్‌సీబీకి షాక్...!

ఆర్‌సీబీకి షాక్...!
x
Highlights

ఐపీఎల్ 12వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు గట్టి షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ ఐపీఎల్...

ఐపీఎల్ 12వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు గట్టి షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భుజానికి గాయం కారణంగా తాను తప్పుకుంటున్నట్టు స్టెయిన్‌ ప్రకటించాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు సాధించిన స్టెయిన్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్సీబీ చైర్మన్‌ సంజీవ్‌ చురివాలి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఐపీఎల్‌ ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన ఆర్సీబీ హ్యాట్రిక్‌ విజయాలతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ విజయం సాధించాల్సిన తరుణంలో స్టెయిన్‌ దూరం కావడం ఆర్‌సీబీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories