అరుదైన ఘనత సాధించిన మలింగా

అరుదైన ఘనత సాధించిన మలింగా
x
Highlights

ఇండియా తో ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగా. ఈ మ్యాచ్లో వికెట్ తీసిన మలింగా అరుదైన ఘనత సాధించాడు....

ఇండియా తో ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగా. ఈ మ్యాచ్లో వికెట్ తీసిన మలింగా అరుదైన ఘనత సాధించాడు. వెళుతూ వెళుతూ ప్రపంచ కప్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. మొట్టమ్మీద వరల్డ్ కప్ లో మలింగా సాధించిన వికెట్లు 56. దీంతో మూడో స్థాన్నాన్ని సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలర్ వసీం అక్రం ను అధిగమించాడు. అతను 55 వికెట్లతో ఇంతవరకూ మూడో స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మలింగా మొత్తం 12 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో మలింగా 219 ఇన్నింగ్స్‌లు ఆడి 335 వికెట్లు సాధించాడు. ఈ వికెట్లు సాధించే క్రమంలో 11 సార్లు నాలుగు వికెట్లను సాధించగా, 8 సందర్భాల్లో ఐదేసి వికెట్లు తీశాడు. ఇక శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌ మలింగా. ఈ జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్‌(523), చమిందా వాస్‌(399)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories