విండిస్ జట్టుపై లంక భారీ విజయం

విండిస్ జట్టుపై లంక భారీ విజయం
x
srilanka (File photo)
Highlights

శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ లో భాగంగా రెండో వన్డేలో లంక జట్టు భారీ విజయాన్ని అందుకుంది. హంబ‌న్‌టోట‌ వేదికగా జరిగిన...

శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ లో భాగంగా రెండో వన్డేలో లంక జట్టు భారీ విజయాన్ని అందుకుంది. హంబ‌న్‌టోట‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో లంక జట్టు 161 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా టాస్ బ్యాటింగ్ కి దిగిన లంక జట్టు నిర్ణిత 50 ఓవర్లలో ఎనమిది వికెట్లకు గాను 345 ప‌రుగులు చేసింది. ఇందులో ఫెర్నాండో (127) టాప్ స్కోర‌ర్ గా నిలవగగా, కుశాల్ మెండిస్ (119) సెంచ‌రీతో ఆకట్టుకున్నాడు. విండీస్ బౌల‌ర్లలో షెల్డన్ కొట్రెల్ (4/67), జోసెఫ్ (3/57) వికెట్లు తీశారు.

ఇక 346 ప‌రుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ జట్టు 39.1 బంతికే ఆలౌట్ అయింది. షాయ్ హోప్ (51) అర్ధసెంచ‌రీతో రాణించి ఒంటరి పోరాటం చేశాడు. లంక బౌల‌ర్లలో హ‌స‌రంగా (3/30), సంద‌కన్ (3/57) వికెట్ల తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు వ‌న్డేల సిరీస్‌ ని 2-0తో మరో మ్యాచ్ ఉండగానే సీరిస్ ని గెలుచుకుంది. మొదటి మ్యాచ్ లో లంక జట్టు ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇక ఇరుజ‌ట్ల మ‌ధ్య చివ‌రిదైన మూడో వ‌న్డే వ‌చ్చేనెల 1వ తేదీన క్యాండీలో జ‌రుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories