బోణి కొట్టిన చెన్నై జట్టు.. బౌలర్ల పాత్ర కీలకం..

బోణి కొట్టిన చెన్నై జట్టు.. బౌలర్ల పాత్ర కీలకం..
x
Highlights

చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్-12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై...

చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్-12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు తొలి విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టు కేవలం 70 పరుగుల మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌లో పార్థివ్ పటేల్ (29) మినహా అందరూ చేతులేత్తేశారు. అతను మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. కోహ్లీ 6, మొయిన్ అలీ 9, ఏబీ డివిలియర్స్ 9, హెట్‌మెయిర్ డకౌట్ అయ్యారు.

ఇలా కీలక ఆటగాళ్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు జట్టు తక్కువ స్కోర్ కే అల్ అవుట్ అయింది. ఇక 71 పరుగుల లక్ష్యంతో ఛేజింగుకు దిగిన చెన్నై17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. చెన్నై బ్యాట్స్‎మెన్స్‎లో వాట్సన్ డక్ అవుట్ కాగా రాయుడు 28, రైనా 19 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 6, జాదవ్ 13 రన్స్‌తో నాటౌ‌ట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్‌కు 3, ఇమ్రాన్ తాహిర్‌కు 3, జడేజాకు 2, డ్వాన్ బ్రావోకు 1 వికెట్ దక్కింది. ఇక చెన్నై విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ ధాటికి కోహ్లీ సేన చేతులెత్తేసింది. వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే రవీద్ర జడేజా 2 , బ్రేవో 1 వికెట్లు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories