విజయం దిశలో వేగంగా సౌతాఫ్రికా..

విజయం దిశలో వేగంగా సౌతాఫ్రికా..
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టును దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేయడంతో 203 పరుగులకే...

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శ్రీలంకతో దక్షిణాఫ్రికా తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టును దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేయడంతో 203 పరుగులకే ఆలౌట్ అయింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా విజయం దిశగా దూసుకుపోతోంది. మలింగా బౌలింగ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(15;16 బంతుల్లో) క్లీన్‌ బౌల్డయ్యాడు. తరువాత వచ్చిన కెప్టెన్ డుప్లిసిస్ తో కల్సి మరో ఓపెనర్ ఆమ్లా పరుగుల వేటను నిదానంగా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమ్లా తన అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా జట్టు ఒక్క వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆమ్లా 52 పరుగులతోనూ, డుప్లిసేస్ 37 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories