logo

నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో సౌతాఫ్రికా..

నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో సౌతాఫ్రికా..
Highlights

తన తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ తో దక్షిణాఫ్రికా ను తిప్పలు పెడుతోంది. కానీ.. సౌతాఫ్రికా సారధి డుప్లిసిస్...

తన తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ తో దక్షిణాఫ్రికా ను తిప్పలు పెడుతోంది. కానీ.. సౌతాఫ్రికా సారధి డుప్లిసిస్ తన సహచరుడు డుసెన్‌ తో కలసి సమర్థవంతంగా భారత్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమం లో ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే.. చాహల్ ఈ జోడీని విడదీశాడు. నిలకడగా ఆడుతున్న డుసెన్‌ (22 ) ను పెవిలియన్ బాట పట్టించాడు. తరువాత వెంటనే కెప్టెన్ డుప్లిసిస్ ను దొరకపుచ్చుకున్నాడు. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ముఖ్యంగా డుప్లిసిస్ అవుట్ అవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ.


లైవ్ టీవి


Share it
Top