కష్టాల్లో సఫారీలు!

కష్టాల్లో సఫారీలు!
x
Highlights

ఎలాగైనా సరే ప్రపంచ కప్ లో తమ రెండో మ్యాచ్ లో గెలవాలని భావించిన దక్షిణాఫ్రికాకు షాక్ తగిలేలా ఉంది. కూనల్లా టోర్నీలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు...

ఎలాగైనా సరే ప్రపంచ కప్ లో తమ రెండో మ్యాచ్ లో గెలవాలని భావించిన దక్షిణాఫ్రికాకు షాక్ తగిలేలా ఉంది. కూనల్లా టోర్నీలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు పులుల్లా మారిపోయారు. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమ్ 330 పరుగులు చేసి సౌతాఫ్రికాకు సవాలు విసిరింది. ప్రతిగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిదానంగా ఆడుతూ వచ్చింది. ఆ నిదానం ఇపుడు వారి కొంప ముంచేలా కనిపిస్తోంది. ఇప్పటికే 40 ఓవర్లు పూర్తయిపోయ్యాయి. ఐదు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న స్థితిలో ఇంకా 103 పరుగులు చేయాల్సి ఉంది. డుమినీ, ఫీలకువయో క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లకు 228 పరుగులు చేసినా ఐదు వికెట్లు కోల్పోవడం ఆ జట్టును కష్టాల్లోకి నెట్టేసింది. ఇటు సఫారీలు ఎంత నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారో.. అంతే నిలకడగా అటు బంగ్లాదేశ్ బౌలింగ్ కూడా ఉంది. దీంతో మ్యాచ్ రసకందాయం లో పడింది. వన్డేల్లో చివరి పది ఓవర్లో వంద పరుగులు చేయడం కష్టం కాదు కానీ, ఒత్తిడికి లొంగిపోయే సౌతాఫ్రికా ఆటగాళ్లు ఈ పరిస్తతి నుంచి బయటపడడం కష్టంగానే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories