కోహ్లీసేనతో చేతులు కలపం : మార్క్‌ బౌచర్‌

కోహ్లీసేనతో చేతులు కలపం : మార్క్‌ బౌచర్‌
x
Highlights

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది.. దీనికి మెడిసిన్ కనిపెట్టే పనిలో ఉన్న శాస్త్రవేత్తలు ప్రస్తుతం నివారణ కోసం కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది.. దీనికి మెడిసిన్ కనిపెట్టే పనిలో ఉన్న శాస్త్రవేత్తలు ప్రస్తుతం నివారణ కోసం కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇందులో ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండడం ఓ చర్యగా ఉంది. అయితే ఈ ప్రభావం క్రికెట్ పైన కూడా పడింది. త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ మాట్లాడుతూ కోహ్లీసేన సహా ఎవరితోనూ కరచాలనం చేయకపోవచ్చని వెల్లడించాడు.

ప్రస్తుతం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కరచాలనం చేయకపోవడమే మంచిదని మేము భావిస్తున్నాం. మాకు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని బౌచర్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికా నుంచి భారత్ కి బయలుదేరే క్రమంలో మీడియాతో మాట్లాడిన బౌచర్‌ ఈ విషయాలను వెల్లడించాడు. ఇక ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మార్చి 12న తొలి వన్డే, లఖ్‌నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది. అన్ని మ్యాచ్ లు భారత కాలమాన ప్రకారం 1.30 గంటలకు మొదలవుతుంది.

భారత జట్టు వివరాలు:

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మనీష్‌ పాండే, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌

దక్షిణాఫ్రికా జట్టు వివరాలు:

ఆండిలే ఫెహ్లుక్వాయో, అన్రిచ్ నార్ట్జే, బ్యూరాన్ హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, ఫాఫ్ డు ప్లెసిస్, జార్జ్ లిండే, హెన్రిచ్ క్లాసేన్, జన్నెమాన్ మలన్, జోన్-జోన్ స్మట్స్, కేశవ్ మహారాజ్, కైల్ వెర్రిన్నే, లుంగీ ఎన్గిడి, లూథో సిపమ్లా, రాస్సీ వాన్ డెర్బా బస్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories