ఓపెనర్లిద్దర్నీ కోల్పోయిన దక్షిణాఫ్రికా

ఓపెనర్లిద్దర్నీ కోల్పోయిన దక్షిణాఫ్రికా
x
Highlights

టీమిండియా అభిమానుల ఎదురుచూపులకు ముగింపు వచ్చింది. వరల్డ్ కప్ లో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతోంది. దక్షిణాఫ్రికా జట్టుతో సౌతాంఫ్టన్ వేదికగా కొద్దిసేపటి...

టీమిండియా అభిమానుల ఎదురుచూపులకు ముగింపు వచ్చింది. వరల్డ్ కప్ లో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతోంది. దక్షిణాఫ్రికా జట్టుతో సౌతాంఫ్టన్ వేదికగా కొద్దిసేపటి క్రితం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచినా సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలింగ్ జోడీ దక్షిణాఫ్రికా ను కట్టడి చేసింది. నాలుగో ఓవర్ లో బుమ్రా తొలి వికెట్ తీశాడు. జస్ప్రీత్‌ బుమ్రా వేసిన 3.2వ బంతిని ఆడబోయి ఓపెనర్‌ ఆమ్లా (6; 9 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. రెండో స్లిప్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ అందుకున్నాడు. ఇక ఆరో ఓవర్లో డికాక్ ను బుమ్రా దెబ్బ తీశాడు. కోహ్లీ అద్భుత క్యాచ్ తో డీకాక్ ( 10 ) దొరికిపోయాడు. దీంతో ఆరో ఓవర్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది.


తొలి వికెట్ తీసిన బుమ్రాను అభినందిస్తూ వీరూ ట్వీట్ చేసాడు. కంగ్రాట్స్ బూమ్..బూమ్.. బుమ్రా.. అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ అభ్హిమానులను అలరిస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories