ఆగస్టులో ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా?

ఆగస్టులో ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా?
x
Highlights

లాక్ డౌన్ ప్రభావం అన్నీ రంగలపైన పడింది. ఇక క్రీడా రంగం విషయానికి వచ్చేసరికి పలు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి.

లాక్ డౌన్ ప్రభావం అన్నీ రంగలపైన పడింది. ఇక క్రీడా రంగం విషయానికి వచ్చేసరికి పలు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి.. అంతేకాకుండా ఈ ఏడాది ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగిస్తూ పలు సడలింపులను ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇందులో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా క్రీడా కార్య‌క‌లాపాల‌ను నిర్వహించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాలలో వెల్లడించింది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఆగ‌స్టులో త‌మ దేశంలో భార‌త్ ప‌ర్య‌టించాల‌ని సౌతాఫ్రికా కోరుకుంటోంది. మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు క్రికెట్‌ సౌతాఫ్రికా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. అయితే దీనికి భారత్ ఒకే చెపుతుందా లేదా అన్నది చూడాలి. ఇక లాక్ డౌన్ కి ముందు సౌత్ ఆఫ్రికా జట్టు మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇండియాకి వచ్చింది.. కానీ అందులో మొదటి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మిగిలిన మ్యాచ్ లను బీసీసీఐ రద్దు చేసింది. ఇక భారత్ కూడా అటు సౌత్ ఆఫ్రికా లో పర్యటించి రెండు సంవత్సరాలు అవుతోంది.

ఈ నేప‌థ్యంలో టీ 20 సిరీస్ కోసం భార‌త్ త‌మ‌దేశంలో ప‌ర్య‌టించాల‌ని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది. ఇది ఇలా ఉంటే భారత్ ముందున్న షెడ్యూల్ ప్ర‌కారం శ్రీలంక‌తో మూడేసి మ్యాచ్‌లు చొప్పున టీ20, వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌, ఆసియాక‌ప్‌, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల‌కు ఆతిథ్య‌మివ్వాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌కు ఓకే చెప్పేది అనుమానంగా మారింది. చూడాలి మరి ఎం జరుగుతుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories