దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ రాబడ ప్రపంచకప్ కు కోలుకుంటాడా?

దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ రాబడ ప్రపంచకప్ కు కోలుకుంటాడా?
x
Highlights

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు కాగిసో రబడ గాయంతో స్వదేశానికి వెళ్ళిపోయాడు. మే 30న...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు కాగిసో రబడ గాయంతో స్వదేశానికి వెళ్ళిపోయాడు. మే 30న ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రబడకు తగిన విశ్రాంతి అవసరం అని భావించిన దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు.. అతనిని వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. బోర్డు ఆదేశాల మేరకు రబడ స్వదేశానికి వెళ్లడంతో.. ఢిల్లీ కీలక ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

అప్పట్నుంచి ఆటను గాయానికి వైద్య సహాయం పొందుతూనే ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుకు రబడా స్టార్ ఆటగాడు. ప్రపంచ కప్ ఎంతో దూరంలో లేకపోవడం తో అతను ఆడుతాడో.. లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) ప్రత్యేక శ్రద్ద తీసుకొంటోంది. జట్టులో ప్రధాన బౌలర్ అవ్వడంతో ప్రపంచకప్‌ వరకు అతను కోలుకునే విధంగా సీఎస్ఏ చర్యలు చేపట్టింది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు డాక్టర్ మొహమ్మద్ మూసాజీ.. రబడ గాయంపై స్పందించాడు.

'కాగిసో రబడపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాం. అతడు బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్నాడు. జట్టులో ప్రధాన బౌలర్ అవడంతో క్రికెట్ సౌతాఫ్రికా అతను త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకొంటోంది. రెండు మూడు వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్‌ వరకు రబడ పూర్తిగా కోలుకుంటాడు. జట్టులో ఆడతాడు' అని మూసాజీ ఆశాభావం వ్యక్తం చేసాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories