ఫైనల్ లో భారత్‌ ఓటమిపై గంగూలీ స్పందన ఇది..

ఫైనల్ లో భారత్‌ ఓటమిపై గంగూలీ స్పందన ఇది..
x
Highlights

మెల్‌బోర్న్‌ వేదికగా నిన్న జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. దీనితో ఆసీస్ ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించగా, వరుస విజయాలతో ఫైనల్ కి చేరిన భారత్ రన్నరప్‌ తో సరిపెట్టుకుంది.

మెల్‌బోర్న్‌ వేదికగా నిన్న జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. దీనితో ఆసీస్ ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించగా, వరుస విజయాలతో ఫైనల్ కి చేరిన భారత్ రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. అన్ని విభాగాల్లో ఆసీస్ పట్టు బిగించి భారత్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిచింది. అయితే భారత్ జట్టు ఓడిపోయినప్పటికి అభిమానుల నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరి మద్దతు లభిస్తోంది.

ఈ నేపద్యంలో జట్టు ఓటమిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. వరుస విజయాలతో జట్టు ఫైనల్ కి చేరడం అద్భుతమని, క్రికెట్లో మీరెంతో ప్రగతి సాధించారని అన్నారు. ఇలాగే ఆడితే ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారని దాదా ట్వీట్ చేశాడు.. గంగూలీతో పాటు భారత సారథి విరాట్‌ కోహ్లీ, లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌, మాజీ బ్యాట్స్‌మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, మహ్మద్‌కైఫ్ జట్టుకు మద్దుతును ఇస్తూ అభినందిస్తున్నారు.

మ్యాచ్ ఇలా సాగింది :

ఇక ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలిసా హేలీ(75 పరుగులు, 39 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సులు)తో టీమిండియా బౌలర్లపై చెలరేగిపోయింది. ఇక మరో ఓపెనర్ మూనీ(78, 54 బంతుల్లో, 10 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచింది. దీనితో ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

ఆ తర్వాత లక్ష్యచేధనకి బరిలోకి దిగిన భారత్ బాట్స్ మెన్స్ ఎక్కడ కూడా నిలకడగా ఆడలేకపోయారు. దిగిన భారత జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తి (33), హర్మన్‌ప్రీత్‌ (4), స్మృతి మంధాన (11), జెమిమా (0), షెఫాలీ వర్మ(2), వేదా (19), శిఖ పాండే (1), రీచా(18),రాధా (1) పరుగులు చేశారు. ఇక ఐదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో ఆసీస్‌ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

భావోద్వేగానికి లోనైన టీంఇండియా :

అయితే ఫైనల్ లో ఓడిపోవడంతో భారత్ ప్లేయర్స్ స్టేడియంలోనే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఫైనల్ లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అనుకున్న అమ్మాయిలు ఘోర ఓటమిని తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.. 16ఏండ్ల షఫాలీ కన్నీళ్లు పెట్టుకోగా ఆమెను తన సహచర క్రీడాకారిణి వర్మను ఓదార్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories