టీమిండియాకు భారీ షాక్.. వరల్డ్ కప్ నుంచి ధావన్ ఔట్

X
Highlights
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ. భారత క్రికెట్ అభిమానులకు చేదు...
Arun Chilukuri11 Jun 2019 8:38 AM GMT
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ. భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆదివారంనాడు ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ సందర్భంగా ధావన్ గాయపడ్డాడు. ఎడమచేతి బొటనవేలికి ఫ్యాక్చర్ అయినట్టు స్కానింగ్ లో తేలింది. ఈ నేపథ్యంలో మూడు వారాల పాటు జట్టుకు ధావన్ దూరమవుతున్నాడు. దీంతో, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లతో జరగనున్న మ్యాచ్ లను ధావన్ లేకుండానే టీమిండియా ఆడనుంది. ధావన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా రిషభ్ పంత్ లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Next Story