కివీస్ టూర్ కి ముందే భారత్ కి షాక్ !

కివీస్ టూర్ కి ముందే భారత్ కి షాక్ !
x
Highlights

కివీస్ టూర్ కి ముందే భారత జట్టుకి పెద్ద షాక్ తగిలేలా అనిపిస్తుంది. జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా కివీస్ టూర్ కి అనుమానమే అనిపిస్తుంది.

కివీస్ టూర్ కి ముందే భారత జట్టుకి పెద్ద షాక్ తగిలేలా అనిపిస్తుంది. జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా కివీస్ టూర్ కి అనుమానమే అనిపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేల సిరీస్ లో రెండు సార్లు గాయపడ్డాడు ధావన్.. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా గాయపడగా, మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ తర్వాత తను భుజానికి పట్టితో కన్పించాడు. దీనితో ధావన్ కివీస్ టూర్ కి అనుమానమేనని తెలుస్తోంది.

ఇక గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో బొటనవేలికి గాయం కావడంతో టోర్నీని నుంచి మధ్యలోనే వైదొలిగాడు ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడుతుండగా అక్కడ కూడా గాయపడడంతో గతకొద్దిరోజులుగా జట్టుకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా మళ్ళీ ఆసీస్ తో సిరీస్ కి ఎంపికయ్యాడు. కానీ తాజాగా గాయపడడంతో కివీస్ టూర్‌లో ధావన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానికి మరికొన్ని రోజులలో స్పష్టత రానుంది.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కి 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ కొత్త సంవత్సరంలో భారత్ కి ఇది రెండో సిరీస్ విజయం ఇది.. అంతకుముందు శ్రీలంక జట్టుతో తలపడి మొదటి సిరీస్ ని గెలుచుకుంది. భారత జట్టు ఆ తర్వాతి న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ న్యూజిలాండ్ పర్యటన కోసం వెళ్లనుంది. ఈనెల 24 నుంచి కివీస్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌ను ఆడుతుంది. అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ షైనీ, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్

న్యూజిలాండ్ టీ20 జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, కొలిన్ గ్రాండ్‌హోమ్, బ్లైర్ టిక్నర్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, హమీశ్ బెనెట్, టామ్ బ్రూసీ, కుగ్లీజిన్, డార్లీ మిచెల్


Show Full Article
Print Article
More On
Next Story
More Stories