ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో సెంటిమెంట్ మరోసారి రిపీట్..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో సెంటిమెంట్ మరోసారి రిపీట్..
x
Highlights

ప్రపంచకప్‌ గెలిచిన ఆరో జట్టు ఇంగ్లాండ్ నిలిచింది. అత్యధికంగా అస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకోగా..వెస్టిండీస్, భారత్ టీంలు రెండేసి సార్లు...

ప్రపంచకప్‌ గెలిచిన ఆరో జట్టు ఇంగ్లాండ్ నిలిచింది. అత్యధికంగా అస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకోగా..వెస్టిండీస్, భారత్ టీంలు రెండేసి సార్లు టైటిల్ గెలిచాయి. పాకిస్తాన్., శ్రీలంక ఒక్కోసారి ప్రపంచ కప్ సొంతం చేసుకున్నాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆతిధ్య దేశం గెలుస్తుందన్న సెంటిమెంట్ మరోసారి నిజమయ్యింది. ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో సెంటిమెంట్ మూడోసారి వర్కవుట్ అయింది. ఆతిథ్య దేశం గెలుస్తుందన్న సెంటిమెంట్ ఇంగ్లండ్ విషయంలోనూ పనిచేసింది. 2011లో ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ధోనీ సేన విజయం సాధించింది. ఆ తర్వాత 2015లో ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వగా ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఐదోసారి ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. ఈసారి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. అనుకున్నట్టే ఇంగ్లండ్ ఫైనల్ చేరుకుంది.. లార్డ్స్ లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించి కొత్త చరిత్రను సృష్టించింది. తొలిసారి వరల్డ్ కప్ సాధించింది.

ఆస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచ కప్ లు కైవసం చేసుకుంది. 1987, 1999, 2003, 2007,2015 లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 1975, 1979లో వెస్టిండీస్, 1983, 2011లో భారత్ రెండేసి సార్లు టైటిల్ సాధించాయి. 1992 లో పాకిస్తాన్, 1996లో శ్రీలంక ఒక్కోసారి వరల్డ్ కప్ సొంతం చేసుకున్నాయి. ప్రపంచ కప్ గెలిచిన ఆరోజట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరని ఘటన లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టి ఇంగ్లండ్ ప్రపంచ కప్ కైవసం చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories