బూమ్ బూమ్ బుమ్రా.. బామ్మగారు.. బౌలింగ్ యాక్షన్!

బూమ్ బూమ్ బుమ్రా.. బామ్మగారు.. బౌలింగ్ యాక్షన్!
x
Highlights

బూమ్..బూమ్ బుమ్రా అంటే ఇప్పుడు భారత జట్టులో ప్రపంచశ్రేణి బౌలర్. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం లో బుమ్రాది ప్రత్యేకశైలి....

బూమ్..బూమ్ బుమ్రా అంటే ఇప్పుడు భారత జట్టులో ప్రపంచశ్రేణి బౌలర్. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం లో బుమ్రాది ప్రత్యేకశైలి. ప్రపంచకప్ లో తన బౌలింగ్ తో అభిమానులకు మరింత ప్రియమైన వాడిగా బుమ్రా మారిపోయాడు. కొన్ని రోజులుగా వరల్డ్ కప్ ఫీవర్ తో ఇండియా ఊగిపోయింది. ఇక బుమ్రా బౌలింగ్ చూసి అంతా అదిరిపోయారు.

ఇక ఓ బామ్మ గారైతే బుమ్రా లానే బౌలింగ్ యాక్షన్ చేస్తూ సంబరాలు చేసుకుంది. ఆమె అచ్చు బుమ్రాలానే బౌలింగ్‌ యాక్షన్‌ చేసి అందిరినీ ఆకట్టుకున్నారు. ఆ వృద్ధురాలు బౌలింగ్‌ చేసిన విధానాన్ని ఆమె కూతురు వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారి బుమ్రాకు చేరింది. ఈ వీడియో చూసిన బుమ్రా రీట్వీట్‌ చేస్తూ.. 'దిస్‌ మేడ్‌ మై డే' అని పేర్కొన్నాడు. కాగా 2016లో టీమిండియాలోకి వచ్చిన బుమ్రా అనతికాలంలోనే ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో ఆకట్టుకోవడంతో పాటు ప్రత్యర్థులను కట్టడి చేయగల నంబర్‌ వన్‌ బౌలర్‌గా మారాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories