నేడు విశాఖలో ఆసక్తికర పోరు : చెన్నైతో ఢిల్లీ ఢీ ...

నేడు విశాఖలో ఆసక్తికర పోరు : చెన్నైతో ఢిల్లీ ఢీ ...
x
Highlights

నేడు ఐపీఎల్‌ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది . విశాఖలో జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ లో ఢిల్లీ మరియు చెన్నై తలబడుతున్నాయి . ఈ మ్యాచ్ లో గెలిచి...


నేడు ఐపీఎల్‌ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది . విశాఖలో జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ లో ఢిల్లీ మరియు చెన్నై తలబడుతున్నాయి . ఈ మ్యాచ్ లో గెలిచి తొలిసారి ఫైనల్ కి చేరాలని ఢిల్లీ ఆశిస్తుంటే మూడుసార్లు ఛాంపియన్‌ గా నిలిచిన చెన్నై ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ గెలిచే దిశగా అడుగులు వేస్తుంది . ఇందులో అనుభవం ఉన్న జట్టును కుర్ర జట్టు ఎలా ఢీ కొడుతుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ..

ఎలిమినేటర్‌ మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ను ఓడించి దిల్లీ ఈ మ్యాచ్‌కు అర్హత సాధించగా క్వాలిఫయర్‌-1లో ముంబయి చేతిలో ఓడిన చెన్నై, లీగ్‌లో టాప్‌-2 ఫినిషర్‌గా ఫైనల్‌ కోసం ఆడేందుకు మరో అవకాశం దక్కించుకుంది.. ఇంతకుముందు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరగగా అందులో చెన్నై 14 సార్లు విజయం సాధించింది . మిగిలిన ఆరుసార్లు ఢిల్లీ గెలిచింది . ఈ మ్యాచ్ లో ఎక్కువగా చెన్నై వైపే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అంతా ఈజీగా కూడా ఢిల్లీని కూడా తిసేయలెం. ఎందుకంటే మ్యాచ్ మ్యాచ్ కి ఢిల్లీ తన అద్భుతమైన ఆటను కనబరుస్తూ ఇక్కడివరకు వచ్చింది .

ఇరు జట్ల బలాబలాలు ఒక్కసారి అంచనా వేస్తే మొదటి నుండి చెన్నైకి అతి పెద్ద బలం ధోనినే. ఈ ఐపీఎల్‌ లో 13 మ్యాచ్‌ల్లో ధోని 405 పరుగులు చేసాడు . ఇప్పుడు కూడా ధోని మెరుగైన ప్రదర్శనను కనబర్చలిసిన అవసరం ఉంది . వాట్సన్ బ్యాటింగ్ చెన్నై ని కలవరపెదుతుంది . రెండు లేదా మూడు మ్యాచ్ లో తప్ప వాట్సన్ పెద్దగా రాణిచింది అయితే లేదు . డుప్లెసిస్‌, రాయుడు, రైనా కూడా తమ వంతు రాణించాల్సిన అవసరం కూడా ఉంది . ఇక బౌలింగ్ విషయంలో చెన్నై కి స్పీన్ బలమే ఎక్కువ . తాహిర్‌, హర్భజన్‌, జడేజాలతో పదునైన బలగం ఉండనే ఉంది . వీరికి తోడు పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ మంచి ప్రదర్శను కనబరచడం అ జట్టుగా మరోబలంగా చెప్పుకోవచ్చు ...

ఇక హైదరాబాద్‌ పై గెలిచిన ఢిల్లీ జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో చెన్నై ని ఢీ కొట్టబోతుంది. మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ టీం కి అతి పెద్ద బలం.ఢిల్లీ గెలిచినా విజయాలలో అతడిదే కీలక పాత్ర. పంత్ కి తోడు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ,శ్రేయస్‌ అయ్యర్‌, మన్రోలతో ఢిల్లీ జట్టు మంచి పటిష్టంగానే కనిపిస్తుంది . గత మ్యాచ్ విశాఖలో నెగ్గిన ఈ జట్టుకు మళ్ళి ఇక్కడే మ్యాచ్ జరగడం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు . ఢిల్లీ జట్టులో కాగిసో రబాడ అత్యధిక వికెట్లు తీసి జట్టులో కీ రోల్ ప్లే చేసాడు . ఇప్పుడు అతని ప్లేస్ లో ఇషాంత్ శర్మ కూడా బాగానే రాణిస్తున్నాడు. ఇక వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా గత మ్యాచ్ లో మెరిసాడు . కీలక సమయంలో చెన్నై బాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తే ఢిల్లీ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . ఇందులో గెలిచినా జట్టు ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో తలబడుతుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories