ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపు

ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపు
x
Highlights

83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సైనా నెహ్వాల్ గెలుచుకొంది. గౌహతీ నెహ్రూ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్లో మాజీ చాంపియన్ పీవీ...

83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సైనా నెహ్వాల్ గెలుచుకొంది. గౌహతీ నెహ్రూ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్లో మాజీ చాంపియన్ పీవీ సింధును సైనా 21-18, 21-15తో చిత్తు చేసింది. తొలిగేమ్ లో వెటరన్ సైనాకు గట్టిపోటీ ఇచ్చిన సింధు రెండోగేమ్ లో తేలిపోయింది. 2017 జాతీయ బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధును 21-17, 27-25తో అధిగమించిన సైనా ప్రస్తుత ఫైనల్లో మాత్రం సునాయాసంగానే విజయం సొంతం చేసుకోగలిగింది. 29 ఏళ్ల సైనా కెరియర్ లో జాతీయ మహిళల సింగిల్స్ గెలుచుకోడం ఇది కేవలం మూడోసారి మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories