ఐసీసీ.. అతనికంత సీన్ లేదు!

ఐసీసీ.. అతనికంత సీన్ లేదు!
x
Highlights

ఒక్కోసారి అభిమానుల ఒళ్లు మండేలా ట్వీట్ చేస్తుంటుంది ఐసీసీ. ఇంగ్లాండ్ టీమ్ ప్రపంచ కప్ గెలిచింది. ఫైనల్స్ లో కొద్దిపాటి అదృష్టం తోడుగా అనేది అందరికీ...

ఒక్కోసారి అభిమానుల ఒళ్లు మండేలా ట్వీట్ చేస్తుంటుంది ఐసీసీ. ఇంగ్లాండ్ టీమ్ ప్రపంచ కప్ గెలిచింది. ఫైనల్స్ లో కొద్దిపాటి అదృష్టం తోడుగా అనేది అందరికీ తెలిసిందే. ఒక్క లిప్తపాటు ఆ అదృష్టం మొహం చాటేస్తే.. ఇంగ్లాండ్ కలలు కల్లలయ్యేవి. ఈ మ్యాచ్ లోఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ బెన్ స్టోక్స్ అజేయంగా 84 పరుగులు చేసి మ్యాచ్ టై అవడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా సూపర్ ఓవర్లోనూ రెండు బౌండరీలతో విరుచుకుపడి అక్కడా టై అవడంలో ముఖ్య పాత్ర వహించాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ డి మ్యాచ్ అవార్డూ దక్కింది.

అవార్డులు ఇచ్చే సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్టోక్స్ కి అవార్డు అందించాడు. ఈ ఫోటోను ఐసీసీ ట్విట్టర్ లో ఉంచింది. దానికి ఆల్‌ టైమ్‌ గ్రేటస్ట్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ అండ్ సచిన్ టెండూల్కర్ అని క్యాప్షన్ పెట్టింది. ఇది ఇప్పుడు భారత అభిమానుల కోపానికి కారణంగా మారింది. ప్రధానంగా ఈ ట్వీట్‌పై సచిన్‌ అభిమానులు మండిపడుతున్నారు.

అసలు బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదంటూ విమర్శిస్తున్నారు. ' గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఎవరో తెలుసా' అంటూ ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ' సచిన్‌తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్‌ లెజెండ్‌, ఎవరు ఎన్ని చేసినా సచిన్‌ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం‌' అంటూ మరొకరూ విమర్శించారు. ' ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ అనేది అర్థమవుతుంది కదా' అని మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు. అసలు బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు. ఇలా పోస్ట్‌ చేసిన వాడ్ని చెప్పుతో కొట్టాలి' అంటూ మరొక అభిమాని మండిపడ్డాఢు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories