మా విన్నర్ మలింగనే .. రోహిత్ శర్మ

మా విన్నర్ మలింగనే .. రోహిత్ శర్మ
x
Highlights

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ తన వన్డే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే . అయితే మలింగ రిటైర్మెంట్ పైన భారత వైస్ కెప్టెన్ మరియు ముంబై...

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ తన వన్డే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే . అయితే మలింగ రిటైర్మెంట్ పైన భారత వైస్ కెప్టెన్ మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అధికార ట్విట్టర్ ద్వారా స్పందించాడు . గత దశాబ్ద కాలంగా మా(ముంబై ఇండియన్స్ ) టీం మ్యాచ్ విన్నర్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడని కెప్టెన్ గా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అతను నాకు చాలా సార్లు అండగా నిలిచాడని రోహిత్ అన్నాడు .



ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా విజయాలను అందిచాడని రోహిత్ పేర్కొన్నాడు . భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని రోహిత్ పేర్కొన్నాడు.మలింగ బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories