వన్డే క్రికెట్ 8వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ..

వన్డే క్రికెట్ 8వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ..
x
Highlights

టీమిండియా వైస్ కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా 8వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు....

టీమిండియా వైస్ కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా 8వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి, 5వ వన్డేలో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా...రోహిత్ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. విరాట్ కొహ్లీ 175 ఇన్నింగ్స్ లోనే 8 వేల పరుగుల మైలురాయిని చేరితే ఏబీ డివిలియర్స్ 182 ఇన్నింగ్స్ లోనూ, సౌరవ్ గంగూలీ 200 ఇన్నింగ్స్ లోనూ ఈ ఘనత సాధించారు.రోహిత్ శర్మ సైతం 8వేల పరుగులు సాధించడానికి 200 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.142 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు సాధించిన రోహిత్ 58 ఇన్నింగ్స్ లో మరో 3 వేల పరుగులు సాధించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories