సూపర్‌ ఓవర్‌ బుమ్రాకే ఎందుకు ఇచ్చామంటే!

సూపర్‌ ఓవర్‌ బుమ్రాకే ఎందుకు ఇచ్చామంటే!
x
Highlights

హామిల్డన్‌ వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ముందుగా టైగా ముగిసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో భారత జట్టు...

హామిల్డన్‌ వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ముందుగా టైగా ముగిసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో బుమ్రా అత్యధిక పరుగులు (45) ఇచ్చినప్పటికీ భారత్ మాత్రం సూపర్ ఓవర్ ని బుమ్రా చేతికే ఇచ్చింది. ఈ సూపర్ ఓవర్ లో బుమ్రా ఆరు బంతుల్లో 17 పరుగులు ఇచ్చాడు. ఆ తరవాత రోహిత్, రాహుల్ బరిలోకి దిగి మ్యాచ్ ని ఫినిష్ చేశారు.

అయితే సూపర్ ఓవర్ బుమ్రాకే ఇవ్వడంపైన రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు. సూపర్ ఓవర్ కి షమి, జడేజాలను పంపించాలనే విషయంసై సందిగ్ధత నెలకొంది. కానీ బుమ్రా జట్టులో కీలకమైన పేసర్‌. యార్కర్లు, స్లో బంతులేసే బుమ్రా అయితే బెటర్ అని పంపిచాము. ఇక బ్యాటింగ్‌ విషయంలోనూ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే బరిలోకి దిగుతారని చెప్పాడు. ఒకవేళ తాను ఈ మ్యాచ్‌లో బాగా ఆడకపోయి ఉంటే మళ్ళీ క్రీజ్ లోకి వెళ్ళేవాడిని కాదని, వేరే ఆటగాడు వెళ్ళేవాడని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్ తో 3-0తో భారత్ సిరీస్ ని కైవసం చేసుకుంది. ఇక నాలుగో టీ 20 రేపు (శుక్రవారం) జరుగుతుండగా, ఫైనల్ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఆ తర్వాత వన్డే మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories