ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్‌శర్మ

ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్‌శర్మ
x
Highlights

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక...

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చోటు సంపాదించాడు. మౌంట్ మాగునీలోని బే ఓవల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా తన సిక్సర్ల సంఖ్యను 215కు పెంచుకొన్నాడు.

ధోనీ తన కెరియర్ లో ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ ఆడిన 337 మ్యాచ్ ల్లో 215 సిక్సర్లు బాదాడు. ఓవరాల్ గా ధోనీకి 222 సిక్సర్లు సాధించిన రికార్డు ఉంది. ఇందులో ఆసియాలెవెన్ జట్టు తరపున ఆడిన సమయంలో ధోనీ సాధించిన ఏడు సిక్సర్లు సైతం ఉన్నాయి. టీమిండియా తరపున ధోనీ సాధించిన 215 సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ మూడో వన్డేతో సమం చేయగలిగాడు. కివీ పేసర్ ఫెర్గూసన్ బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా రోహిత్ తన సిక్సర్ల సంఖ్యను 215కు పెంచుకోగలిగాడు.

రోహిత్ శర్మ సిక్సర్లు బాదుడులో మాత్రమే కాదు అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని చేరిన భారత పదవ క్రికెటర్ గా కూడా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ 10 వేల పరుగులను 260 ఇన్నింగ్స్ లో సాధించగలిగాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 219 ఇన్నింగ్స్ లో, సౌరవ్ గంగూలీ 252 ఇన్నింగ్స్ లో, మాస్టర్ సచిన్ 257 ఇన్నింగ్స్ లో 10 వేల పరుగులు సాధించగలిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories