రోహిత్ సెంచరీ..వరల్డ్‌కప్‌లలో కొత్త రికార్డు..

రోహిత్ సెంచరీ..వరల్డ్‌కప్‌లలో కొత్త రికార్డు..
x
Highlights

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 30.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 189 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2...

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 30.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 189 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రోహిత్ వరల్డ్ కప్‌లలో ఓ కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఓ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఉన్న సంగక్కర రికార్డును బద్దలుగొట్టాడు. సెంచరీ చేసిన వెంటనే రోహిత్ రజిత బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 81 పరుగులు, 8 ఫోర్లు, 1 సిక్సర్)కూడా ధాటిగా ఆడుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories