ధోనీ పేరుతో ఉన్న 12 ఏళ్ల రికార్డును తెరమరుగు చేసిన పంత్

Rishabh Pant
x
Rishabh Pant
Highlights

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజుఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు.

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజుఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు. 2006 సిరీస్ లో భాగంగా ఫైసలాబాద్ వేదికగా ముగిసిన టెస్టులో అప్పటి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా 148 పరుగుల స్కోరు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును ఆస్ట్రేలియా గడ్డపై 159 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా రిషభ్ పంత్ అధిగమించాడు. పంత్ మొత్తం 189 బాల్స్ ఎదుర్కొని 15 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తన కెరియర్ లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. 21 సంవత్సరాల రిషభ్ పంత్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిది టెస్టు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories