ధోనీ వల్లే ఓడిపోయాం:యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌

ధోనీ వల్లే ఓడిపోయాం:యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌
x
Highlights

ధోనీ వల్లే సెమీస్ లో ఓడిపోయామని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ ధోనీపై విరుచుకు పడ్డారు. ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన...

ధోనీ వల్లే సెమీస్ లో ఓడిపోయామని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ ధోనీపై విరుచుకు పడ్డారు. ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ, మ్యాచ్ లో ఓటమికి కారణం ముమ్మాటికీ ధోనీ నే అని అన్నారు. డెత్ ఓవర్లలో ధోనీ నెమ్మదిగా ఆది.. జడేజా మీద ఒత్తిడి పెంచాడు. అదే విధంగా పాండ్యాను కూడా చేశాడు. దీంతో ఒత్తిడికి వారిద్దరూ ఔటయ్యారు. మరోవైపు తాను మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు అని చెప్పారు.

మిస్టర్‌ ధోనీ నువ్వు ఇప్పటికే చాలా క్రికెట్‌ ఆడావు. ఎలా ఆడాలో ఎలా ఆడకూడదో ఆమాత్రం తెలియదా?నీలాగే యువరాజ్‌ ఎప్పుడైనా వేరే ఆటగాళ్లకి అలా, ఇలా ఆడమని చెప్పాడా?నీకు మంచి బంతులు పడ్డప్పుడు నువ్వెందుకు సిక్సులు కొట్టలేకపోయావు?అప్పుడు నీకు ఆందోళన లేదా? నువ్వు ముందే ఔటైనా ఫలితంలో పెద్ద తేడా ఉండేది కాదు' అని ఘాటుగా స్పందించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories