Top
logo

టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి భావోద్వేగం

టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి భావోద్వేగం
Highlights

వెల్లింగ్టన్‌లో రేపు భారత్ , న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టు సందర్భంగా టీంఇండియా కోచ్ రవిశాస్త్రి ...

వెల్లింగ్టన్‌లో రేపు భారత్ , న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టు సందర్భంగా టీంఇండియా కోచ్ రవిశాస్త్రి భాగోద్వేగానికి లోనయ్యారు. రేపు ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మొదలుకానుంది. అయితే సరిగ్గా 39 ఏళ్ల క్రితం అంటే 1981లోఫిబ్రవరి 21న ఇదే వేదికగా న్యూజిలాండ్‌-భారత్‌ జట్లు తలపడ్డాయి. ఆ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో శాస్త్రి అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా చ‌టేశ్వర్ పుజారా రవిశాస్త్రిని ఇంట‌ర్వ్యూ చేశాడు.

అప్పుడు రవిశాస్త్రి వయసు 19 ఏళ్లు. 151వ నంబర్ గల టోపీని అందుకున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే దిలీప్‌ గాయపడడంతో ముంబై తరఫున కాన్పూర్‌లో రంజీ క్వార్టర్స్‌ ఆడుతున్న రవిశాస్త్రికి టీమిండియా నుండి కబురు అందింది. దీనితో అల తన అరంగేట్రం మొదలైంది. ఈ మ్యాచ్ లో రవిశాస్త్రి అల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో బారత్ 62 పరుగుల తేడాతో ఓడినప్పటికీ ఆ తర్వాత శాస్త్రి 11 ఏళ్లు టీమ్‌ఇండియా తరఫున ఆడారు. ఇప్పుడు కోచ్‌గా ఉన్నారు. రవిశాస్త్రి ప్రారంభంలో బౌలర్‌గానే క్రీడా జీవితం ప్రారంభించినప్పటికి ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌గా రాణించి అల్ రౌండర్ గా ఎదిగాడు.

ఇక న్యూజిలాండ్ జట్టుతో అయిదు టీ 20 మ్యాచ్ లో క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా.. మూడు వన్డేల సిరీస్ లో వైట్ వాష్ కి గురైంది. ఇక రేపటి నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ని జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం టీం ఇండియా భారత్ కి వస్తుంది. అనంతరం సొంతగడ్డపై దక్షణాప్రికాతో తలపడుతుంది.


Web TitleRavi Shastri Recalls Test Debut At Wellington 39 Years Ago
Next Story


లైవ్ టీవి