విశాఖ మ్యాచ్ కి వర్షం దెబ్బ

విశాఖ మ్యాచ్ కి వర్షం దెబ్బ
x
Highlights

విశాఖ పట్టణంలో టీమిండియాకు, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. టీమిండియా స్కోర్ 202 పరుగులు ఉన్నప్పుడు మ్యాచ్‌...

విశాఖ పట్టణంలో టీమిండియాకు, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. టీమిండియా స్కోర్ 202 పరుగులు ఉన్నప్పుడు మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. మ్యాచ్‌ ఆగిన సమయానికి రోహిత్‌ శర్మ 115 పరుగులు, మయాంక్ అగర్వాల్‌ 84 పరుగులు చేసి అజేయంగా ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు శుభారంభం ఇచ్చారు. తొలిసారి ఓపెనర్‌ అవతారం ఎత్తిన రోహిత్‌ శర్మ సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. 163 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్‌ కూడా తడబాటు లేకుండా సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌ ఆగే సమయానికి 84 పరుగులు చేశాడు. వర్షం ఎంతకూ తగ్గే అవకాశం లేకపోవడంతో అంపైర్లు 30 ఓవర్ల ముందే తొలిరోజు ఆటను నిలిపివేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories