Top
logo

రాహుల్ గాంధీ ఏపీ పర్యటన వివరాలు..

రాహుల్ గాంధీ ఏపీ పర్యటన వివరాలు..
X
Highlights

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ఈ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం...

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ఈ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. కాగా ఆ రోజు ఉదయం విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మధ్యాహ్నం కళ్యాణదుర్గం వస్తారు.

రాహుల్‌ పర్యటనకు పార్టీ పెద్దలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే వారికి మద్దతుగా జాతీయ నేతలు ఎవరూ కూడా ఇప్పటివరకు ప్రచారానికి రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మిత్రపక్ష నాయకుడైన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కడపలో టీడీపీ తరుపున ప్రచారం చేశారు.

Next Story