దేశ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న పీవీ సింధు

దేశ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న పీవీ సింధు
x
దేశ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న పీవీ సింధు
Highlights

తెలుగు తేజం పీవీ సింధూకు మరో అపూర్వ గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్...

తెలుగు తేజం పీవీ సింధూకు మరో అపూర్వ గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ సింధూను వరించింది. ఐదేళ్ల క్రితం 2015లో సింధూకు పద్మశ్రీ దక్కింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగుతేజం ఖాతాలో ఇప్పటికే 5 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలున్నాయి. గతేడాది జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గిన 24 ఏళ్ల సింధు కెరీర్‌లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలున్నాయి. బ్యాడ్మింటన్ ప్రపంచానికి రారాణిగా వెలుగొందుతున్న పీవీ సింధు ఎన్నో పతకాలు మరోఎన్నో ఘనతలు సాధిస్తూ ముందుకు సాగుతున్నది. క్రీడాకారులకే కాదు యువత అందరికీ ఆదర్శంగా నిలిచింది.

సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన పీవి సింధూ ప్రపంచ బ్యాడ్మింటన్ లో ప్రకంపనలు సృష్టించింది. బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఏదో ఒక్క పతకం గెలవడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో సింధు వచ్చి అద్భుతాలు చేసింది. వరుసగా 2013, 2014 లో రెండు కాంస్యాలు, 2017, 2018లో రెండు రజత పథకాలు సాధించింది. 2016లో రియో ఒలింపిక్స్ లో రజతం సాధించి జాతీయ తారగా అవతరించింది. 2013లో అర్జున అవార్డు గెలిచిన సింధు 2015లో పద్మశ్రీకి ఎంపికైంది. 2016లో ఖేల్‌రత్న దక్కించుకుంది. ఇప్పుడు పద్మభూషణ్‌ ఆమెను వరించింది. మూడు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన సింధూ ప్రయాణం ఆగిపోలేదు. గత ఏడాది ఏకంగా స్వర్ణ పథకమే సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ శిఖరంపై కూర్చుంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్దమవుతున్న సింధు. ఈ ప్రోత్సాహంతో విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో మెరుస్తుందని ఆశిద్దాం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories