సింధు పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్..పెరిగిన సింధు బ్రాండ్‌ వాల్యూ

సింధు పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్..పెరిగిన సింధు బ్రాండ్‌ వాల్యూ
x
Highlights

సింధు ఇప్పుడు ఇది పేరు మాత్రమే కాదు ఇట్సే ఏ బ్రాండ్. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించి నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసిన సింధు. భారత్‌లో అత్యంత...

సింధు ఇప్పుడు ఇది పేరు మాత్రమే కాదు ఇట్సే ఏ బ్రాండ్. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించి నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసిన సింధు. భారత్‌లో అత్యంత విలువైన మహిళా ప్లేయర్‌గా నిలించింది. ఇటు జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు సింధూ కోసం పోటీ పడుతుండటంతో ఆమె బ్రాండ్ వాల్యూ అమాతం పెరిగింది. దీంతో బ్రాండ్‌లకే బ్రాండ్‌గా సింధూ మారుతోంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన వారి వివరాలు, అత్యంత ఆదాయం అందుకుంటున్న వారి గురించి ప్రతి సంవత్సరం ఫోర్బ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఓ లిస్ట్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. లిస్ట్‌లో అత్యంత ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్‌లే అధికం. అయితే తాజాగా ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు చేరింది ప్రపంచ వ్యాప్తంగా వివిధ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ అత్యంత ఆదాయం పొందుతూ ఉమెన్‌ కేటగిరిలో 7వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది.

ఫోర్బ్స్‌ లిస్ట్‌ను పరిశీలిస్తే క్రీడారంగం నుంచి క్రికెటర్‌లే అధికంగా కనిపిస్తారు. ప్రస్తుతం పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం 2 కోట్లు సంపాదిస్తున్నాడు. దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు కోటి 50 లక్షలు తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచింది సింధు. ప్రస్తుతం సింధు చేతిలో 20 బ్రాండులు ఉన్నాయి.

ప్రస్తుతం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బ్రాండులకు సింధు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ బ్యాండ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ని సింధూ కైవసం చేసుకోవడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాండ్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారం విలువ మరింత పెరుగుతుందని ఆనందంతో మునిగిపోతున్నారు. మొత్తానికి సింధు బ్రాండ్ వేల్యూ రోజురోజుకీ పెరుగుతోంది దీంతో సింధు ఈ పేరే ఇప్పుడు బ్రాండ్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories